Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భూ సమస్యలపై పలమనేరు మండలం( MRO )తహసిల్దార్ గారిని కలిసిన MDPS నాయకులు

    Author RAJANEETHI | 29 Jul 2026, 06:35 PM | ANDHRA PRADESH, ఆంధ్రప్రదేశ్
    భూ సమస్యలపై పలమనేరు మండలం( MRO )తహసిల్దార్ గారిని కలిసిన MDPS నాయకులు

    బుధవారం 29-07-2026:-
    ఈరోజు MDPS రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ అన్న గారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం MRO ఎమ్మార్వో గారిని కలిసిన MDPS రాష్ట్ర కోర్ కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి జిల్లాలఇన్చార్జ్ పురుషోత్తం, తిరుపతి జిల్లా అధ్యక్షులు తేనేటి గురుశంకర్ ప్రసాద్, చిత్తూరు జిల్లా గౌరవాధ్యక్షులు నీరుకొండ చంద్రశేఖర్, పలమనేర్ మండల అధ్యక్షులు c.మణి,పూతలపట్టు నియోజకవర్గం అధ్యక్షులు N.చంద్రయ్య పలమనేరు నియోజకవర్గం నాయకులు కలవడం జరిగినది. గత కొద్దిరోజులుగా పలమనేరు మండలం T కొటూర్ గ్రామంలో నివాసముండు ఎస్సీ మాదిగ కులానికి చెందిన సి. మొగులయ్య అతని భార్య జగదాంబ పేరు పైన ఉన్న భూమిని కొలిచి సరిహద్దులు చూపుట కొరకై గత నాలుగు సంవత్సరాల నుంచి ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగి తమ సమస్యను విన్నవించిన ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు ఈ సమస్య పరిష్కారం కొరకు గత పది రోజుల క్రితమే MDPS రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా లీడర్లు వీరు కూడా ఎమ్మార్వో గారితో మాట్లాడటం జరిగింది గత వారం రోజుల్లో వారి భూమి కొలసి సరిహద్దులు చూపించి వారి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మార్వో గారు చెప్పడం. ఈ సమస్య విషయమై ఈరోజు ఎమ్మార్వో గారిని MDPS మరియు బాధితులు కలడం జరిగింది. పూర్తిస్థాయిలో మొగులయ్య జగదాంబ పేరు పైనున్న భూమిని కొలిచి సరిహద్దులు చూపించాలని నాయకులు చెప్పడం జరిగింది . ఎమ్మార్వో గారు స్పందించి వారం రోజుల్లో సంబంధిత అధికారులను అక్కడికి పంపించి పూర్తిస్థాయిలో టోటల్ విస్తీర్ణ భూమిని సర్వే చేయించి సరిహద్దులు చూపించి వారి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో MDPS రాష్ట్ర కోర్ కమిటీ నాయకులు మరియు జిల్లా నాయకులు,మండల నాయకులు,నియోజకవర్గ నాయకులు అదేవిధంగా బాధితులైన మొగులయ్య మరియు ప్రజలు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి