Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు వైఎస్సార్‌సీపీ డిమాండ్

    Author RAJANEETHI | 29 Jul 2026, 10:41 AM | ANDHRA PRADESH
    డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు వైఎస్సార్‌సీపీ డిమాండ్

    మదనపల్లి, జూలై 29 (రాజనీతి): డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో మదనపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, డీఎస్సీ ప్రక్రియలో వచ్చిన అభ్యంతరాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు మలతోటి నరేష్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి