డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు వైఎస్సార్‌సీపీ డిమాండ్
మదనపల్లి, జూలై 29 (రాజనీతి): డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో మదనపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, డీఎస్సీ ప్రక్రియలో వచ్చిన అభ్యంతరాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు మలతోటి నరేష్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.