Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సంక్షేమం–అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం: డోర్ టు డోర్ ప్రచారంలో టీడీపీ నేతలు

    సంక్షేమం–అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం: డోర్ టు డోర్ ప్రచారంలో టీడీపీ నేతలు

    వాల్మీకిపురం, 2026 జూలై 28:
    రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో చేపట్టిన 'డోర్ టు డోర్' కార్యక్రమంలో భాగంగా మంగళవారం వాల్మీకిపురం పంచాయతీ పరిధిలోని దండువారిపల్లిలో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.

    ఈ సందర్భంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైందని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక వినూత్న పథకాలను అమలు చేస్తోందని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సేవలు, సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు విశేష ఆదరణ చూపుతున్నారని వారు పేర్కొన్నారు.

    అదేవిధంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడమే ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు వివరించారు. ప్రభుత్వంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ వలిగట్ల వెంకటరమణ, వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కోసూరి చంద్రమౌళి, టీడీపీ మండల అధ్యక్షుడు దామోదర్ రెడ్డి , మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి, వాల్మీకిపురం మాజీ సర్పంచ్ రాజేంద్ర ఆచారి, క్లస్టర్ ఇన్‌చార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి