సంక్షేమం–అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం: డోర్ టు డోర్ ప్రచారంలో టీడీపీ నేతలు
వాల్మీకిపురం, 2026 జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో చేపట్టిన 'డోర్ టు డోర్' కార్యక్రమంలో భాగంగా మంగళవారం వాల్మీకిపురం పంచాయతీ పరిధిలోని దండువారిపల్లిలో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైందని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక వినూత్న పథకాలను అమలు చేస్తోందని,...