Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేణిగుంట దద్దరిల్లిన డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

    Author RAJANEETHI | 28 Jul 2026, 05:04 PM | ANDHRA PRADESH
    రేణిగుంట దద్దరిల్లిన డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

    రేణిగుంట, జూలై 28 (రాజనీతి): తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు, తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడు డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు రేణిగుంట పట్టణంలో భారీ అభిమానుల సందడితో ఘనంగా నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనడంతో పట్టణమంతా పసుపు జెండాలతో కళకళలాడింది. బైక్ ర్యాలీలు, నినాదాలు, టపాసుల మోతలు, పాలాభిషేకాలు, కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. జన్మదిన వేడుకల్లో భాగంగా చెక్‌పోస్ట్‌లోని రమణ విలాస్ సర్కిల్ నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీలో సుమారు 2,000 మంది బైక్‌లపై పాల్గొన్నారు. పార్టీ జెండాలు చేతబూని, డాలర్స్ దివాకర్ రెడ్డి చిత్రపటాలతో యువత భారీగా ర్యాలీలో పాల్గొంది. ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా సాగుతూ జై తెలుగుదేశం... జై డాలర్స్ దివాకర్ రెడ్డి... దివాకర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో పట్టణం మారుమోగింది. ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకోగా అక్కడ అభిమానులు భారీ ఎత్తున చేరి నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బైక్‌ల హారన్‌లు, టపాసుల శబ్దాలు, డప్పుల మోతలతో ఆ ప్రాంతం సందడిగా మారింది. పలువురు అభిమానులు పూల వర్షం కురిపిస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి (సోము), బుల్లెట్ రాజా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్‌కు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం భారీ జన్మదిన కేక్‌ను కట్ చేసి కార్యకర్తలు, అభిమానులకు పంపిణీ చేశారు. ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. కార్యక్రమం అనంతరం సుమారు 5,000 మంది పేదలు, నిరుపేదలు, ప్రయాణికులు, కార్మికులకు అన్నదానం నిర్వహించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అన్నదానంలో పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమైన విషయం అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి (సోము), బుల్లెట్ రాజు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తున్న డాలర్స్ దివాకర్ రెడ్డికి రేణిగుంట ప్రజల్లో ప్రత్యేక ఆదరణ ఉందన్నారు. ఆయన మరింత ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల సందర్భంగా పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యకర్తల ఉత్సాహం, అభిమానుల సందడి, సేవా కార్యక్రమాల నిర్వహణతో ఈ జన్మదిన వేడుకలు రేణిగుంటలో విశేష చర్చనీయాంశంగా మారాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని డాలర్స్ దివాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

    రేణిగుంట దద్దరిల్లిన డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు - Additional Image
    అత్యధికంగా చదివినవి