రేణిగుంట దద్దరిల్లిన డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు
రేణిగుంట, జూలై 28 (రాజనీతి): తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు, తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడు డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు రేణిగుంట పట్టణంలో భారీ అభిమానుల సందడితో ఘనంగా నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనడంతో పట్టణమంతా పసుపు జెండాలతో కళకళలాడింది. బైక్ ర్యాలీలు, నినాదాలు, టపాసుల మోతలు, పాలాభిషేకాలు, కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. జన్మదిన వేడుకల్లో భాగంగా చెక్‌పోస్ట్‌లోని రమణ విలాస్ సర్కిల్ నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీలో సుమారు 2,000 మంది బైక్‌లపై పాల్గొన్నారు. పార్టీ జెండాలు చేతబూని, డాలర్స్ దివాకర్...