Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డీఎస్సీ అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి.. మూడు డిమాండ్లతో వైసీపీ రేపు ఆందోళన

    డీఎస్సీ అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి.. మూడు డిమాండ్లతో వైసీపీ రేపు ఆందోళన

    రేపు తేదీ 28-07-2026 మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో విద్యార్థి మరియు యువజన విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించబడును .

    ఇందులో భాగంగా, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రేపు ఉదయం (మంగళవారం) 9:30 గంటలకు చిత్తూరు బస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించబడును

    డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ. 9,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మరియు ఎన్నికల హామీ ప్రకారం ప్రతినెలా రూ. 3,000 నిరుద్యోగ భృతి చెల్లించకుండా మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.

    ఇవి కూడా చదవండి

    కావున పీలేరు నియోజకవర్గం లోని వైయస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల నాయకులు, విద్యార్థి-యువజన విభాగాల ప్రతినిధులు, విద్యార్థులు మరియు యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.

    ఇట్లు
    EX-MLA గారి క్యాంప్ కార్యాలయం.
    వాల్మీకిపురం

    అత్యధికంగా చదివినవి