Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • క్యాన్సర్ బాధితుడికి అండగా ఎంపీ మిథున్ రెడ్డి.. రూ.3 లక్షల ఆర్థిక సహాయం మంజూరు

    క్యాన్సర్ బాధితుడికి అండగా ఎంపీ మిథున్ రెడ్డి.. రూ.3 లక్షల ఆర్థిక సహాయం మంజూరు

    పుంగనూరు, రాజనీతి (జూలై 27): అన్నమయ్య జిల్లా పుంగనూరులో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తికి రాజంపేట పార్లమెంట్ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆర్థిక చేయూత అందించారు. ఆయన ఆదేశాల మేరకు ఎంపీ నిధుల నుంచి రూ.3 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది.

    పుంగనూరు పట్టణంలోని రహమత్ నగర్‌కు చెందిన ఎస్. బావజన్ క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఎంపీ మిథున్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి వైద్య చికిత్సకు అవసరమైన సహాయం అందేలా చర్యలు చేపట్టారు.

    ఎంపీ నిధుల నుంచి రూ.3 లక్షల సహాయాన్ని మంజూరు చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ ఆర్థిక సహాయం బాధిత కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందని స్థానికులు పేర్కొన్నారు.

    ఇవి కూడా చదవండి

    ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎస్. అలీమ్ భాషా, రాయలసీమ జిల్లాల జోనల్ మైనార్టీ అధ్యక్షుడు ఫకృద్దీన్ షరీఫ్, జిల్లా మాజీ వక్ఫ్ చైర్మన్ ఎం.డి. రహంతుల్లా, వైసీపీ నాయకులు మహబూబ్ బాషా, కొండవీటి నరేష్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

    సకాలంలో స్పందించి ఆర్థిక సహాయం అందించిన ఎంపీ మిథున్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

    అత్యధికంగా చదివినవి