క్యాన్సర్ బాధితుడికి అండగా ఎంపీ మిథున్ రెడ్డి.. రూ.3 లక్షల ఆర్థిక సహాయం మంజూరు

పుంగనూరు, రాజనీతి (జూలై 27): అన్నమయ్య జిల్లా పుంగనూరులో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తికి రాజంపేట పార్లమెంట్ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆర్థిక చేయూత అందించారు. ఆయన ఆదేశాల మేరకు ఎంపీ నిధుల నుంచి రూ.3 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. పుంగనూరు పట్టణంలోని రహమత్ నగర్‌కు చెందిన ఎస్. బావజన్ క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఎంపీ మిథున్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి వైద్య చికిత్సకు అవసరమైన సహాయం అందేలా చర్యలు చేపట్టారు. ఎంపీ నిధుల నుంచి రూ.3 లక్షల సహాయాన్ని మంజూరు చేసినట్లు పార్టీ...