Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 'తల్లికి వందనం' తో విద్యకు బలం - ఎమ్మెల్యే కిషోర్

     'తల్లికి వందనం' తో విద్యకు బలం - ఎమ్మెల్యే కిషోర్

    రూ.10,120 కోట్లతో 'తల్లికి వందనం'
    67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.15,000


    ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమందికీ రూ.15,000

    తల్లుల ఖాతాల్లోకి 'తల్లికి వందనం' నిధులు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ప్రకటన


    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తల్లుల ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'తల్లికి వందనం' పథకం నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని, ఈ పథకం విద్యార్థుల జీవితంలో బలమైన పునాదిగా నిలుస్తుందని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు.

    అన్నమయ్య జిల్లా గుర్రంకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేలమంది విద్యార్థులు,తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం పండగ వాతావరణం లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15,000 ఆర్థిక సహాయం అందుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా అంతమందికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు.

    మొదటి ఏడాది 2025-26 విద్యా సంవత్సరంలో 67,27,164 మంది విద్యార్థుల కోసం రూ.10,091 కోట్లతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది.

    ఇక రెండో ఏడాది 2026-27 విద్యా సంవత్సరానికి 67,47,190 మంది విద్యార్థుల కోసం రూ.10,120.78 కోట్లు కేటాయించి మరోసారి ఈ పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
    అదేవిధంగా పీలేరు నియోజకవర్గంలో ప్రతి విద్యార్థికి 15000 చొప్పున వారి ఖాతాల్లో జమవుతుందని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు ఆటల పోటీలతో తమ ప్రతిభను కనబరిచారు

    దాంతోపాటు విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు యూనిఫామ్ లు కిట్లను అందజేశారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థినీ విద్యార్థులు గొప్ప చదువులు చదువుకుని ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని సూచించారు.

    దేశంలోనే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ,ఎలాంటి షరతులు లేకుండా పిల్లలను చదివించడమే అర్హతగా రూపొందించిన 'తల్లికి వందనం' పథకం విద్యార్థుల భవిష్యత్తుకు పెద్ద అండగా నిలుస్తుందని, తల్లుల ముఖాల్లో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు.

    ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నల్లారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

    అత్యధికంగా చదివినవి