Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి:జిల్లా కార్యదర్శి టి.కృష్ణప్ప

    Author RAJANEETHI | 21 Jul 2026, 07:37 PM | ANDHRA PRADESH, Politics
    వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి:జిల్లా కార్యదర్శి టి.కృష్ణప్ప

    ప్రచురణార్థం:- 21/7/2026 మంగళవారం

    ఈనెల 24వ తేదీ శుక్రవారం,మదనపల్లి నందు గల జిల్లా ఎస్టీయు కార్యాలయంలో జరిగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిటి.కృష్ణప్ప పిలుపునిచ్చారు. మగళవారం 21 వ తేదీన స్థానిక చిన్న తిప్ప సముద్రం చెంచులక్ష్మి యానాధికాలని నందు మదనపల్లి నియోజకవర్గ సమావేశం కే సిద్దయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప ఈ‌ సందర్భంగా పాల్గొన్న ,మాట్లాడుతూ; ఎన్నికలకు ముందు వ్యవసాయ కూలీలకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం సదురు హామీలను తుంగలో తొక్కి కష్టజీవులను పూర్తిగా మోసం చేసిందన్నారు. మదనపల్లి నియోజకవర్గంలో గిరిజనులు దళితులు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెట్లు ఇంటి స్థలం ఇస్తూ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటిదాకా ఒక ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేదని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా పేదలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని వారు తీయబడ్డారు గిరి పుత్రులకు అటవీ బంజర భూములు ఫారెస్ట్ భూములు వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూమిని కార్పొరేట్లకు,ధనవంతులకు,రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారు చౌకగా కట్టపెట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని, భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు సాగు భూమిని పంపిణీ చేసేందుకు శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. 2013 సంవత్సరం నుండి పేదలకు భూ పంపిణీ పూర్తిగా ఆగిపోయిందని, గతంలో కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులు మేరకు భూమిలేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల సాగు భూమి, ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వవచ్చని,అందుకు సరిపడా ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపినా కూడా ఆ సిఫార్సులను ప్రభుత్వాలు చెత్తబుట్టలో పడేసాయని విమర్శించారు.ఈ నేపథ్యంలో పేదలను సమాయత్తం చేసి మరో భూ పోరాటాలకు శ్రీకారం చుట్టాలనే లక్ష్యంతో ఈ యొక్క సమావేశం జరుగుతున్నదని,ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బికేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు లు హాజరవుతున్నారని, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించే సమావేశానికి అధిక సంఖ్యలో కష్టజీవులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం సమావేశం లో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులుL మునిరత్నం కె సిద్దాయ్య మునికట్టయ్య గోపాల్ ప్రసాద్ వెంకటేష్ ఉమా నీవవతి నిర్మలమ్మ భూదేవి భూదేవి రాజామ్మ రాణి పాపులమ్మ తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి