Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అంబటి రాంబాబు యావత్ మాదిగ మహిళ సమాజానికి క్షమాపణ చెప్పాలి - ఎమ్మార్పీఎస్ అన్నమయ్య కో ఇన్ఛార్జి వై రవీంద్ర మాదిగ

     అంబటి రాంబాబు యావత్ మాదిగ మహిళ సమాజానికి క్షమాపణ చెప్పాలి   - ఎమ్మార్పీఎస్ అన్నమయ్య కో ఇన్ఛార్జి వై రవీంద్ర మాదిగ

    అన్నమయ్య జిల్లా
    21;07;2026

    అంబటి రాంబాబు హోంమంత్రి అనితకు క్షమాపణ చెప్పాలి


    మదనపల్లి జులై 21

    ఇవి కూడా చదవండి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత పై వైయస్సార్ సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అన్నమయ్య జిల్లా కో ఇన్ఛార్జి రవీంద్ర మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి దుమ్ముచిన్న మాదిగ డిమాండ్ చేశారు.

    రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సిపి నేత అంబటి రాంబాబు బేసరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ తో
    పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కో ఇన్చార్జి వై రవీంద్ర మాదిగ ఆధ్వర్యంలో కేంద్రం మదనపల్లిలో అనిబిసెంట్ సర్కిల్ నందు ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు
    ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఒక మహిళా మంత్రిపై నీకు సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేయాలని, ఈ పదవిని పట్టుకొని ఊగులాడుతున్నావని అత్యంత హీనంగా, నీచమైన భావన వచ్చే విధంగా అంబటి రాంబాబు అవమానకరంగా మాట్లాడడం చాలా బాధాకరమని పేర్కొన్నారు.
    ఈ వ్యాఖ్యలకు అంబటి రాంబాబు మాదిగ జాతికి, యావత్ మహిళా సమాజానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
    రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద అధికార పార్టీని నిలదీసే హక్కు ఉంటుంది. కాని ఒక మహిళా మంత్రిపై అహంకారపూరితంగా, అవమానకర వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమన్నారు.
    ఈ విషయంపై వెంటనే వైఎస్ఆర్సిపి అధినేత వై ఎస్. జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకునే విధంగా, అలాగే బహిరంగ క్షమాపణ చెప్పించే విధంగా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోతే మాదిగ ప్రజలు, యావత్తూ మహిళా సమాజ ఆగ్రహానికి వైయస్సార్సీపి గురికాక తప్పదన్నారు.
    ఈ సమావేశంలో
    పీలేరు నియోజకవర్గ ఇన్చార్జి గండికోట వెంకటేష్, కో ఇంచార్జ్ ముదివేటి శ్రీనివాసులు, మదనపల్లి ఎమ్మెస్ పి టౌన్ ఇంచార్జ్ యర్రంవారిపల్లి రాజా, రామకృష్ణ, రఘు, రమణ, సత్తి, బాబు, తంబళ్లపల్లె నియోజకవర్గం కో ఇన్చార్జి జి వెంకటప్ప ఎమ్మార్పీఎస్ కలకడ మండల అధ్యక్షులు హరినాధ, వాల్మీకిపురం మండల అధ్యక్షులు గంతా బాలకృష్ణ, ఎంఎస్పి పీలేరు మండల అధ్యక్షులు బాలసుబ్రమణ్యం, సీనియర్ నాయకులు మురళి, పెద్దమండెం మండల అధ్యక్షులు వి రాజేంద్ర అధికార ప్రతినిధి సురేంద్ర మాజీ మండల అధ్యక్షులు ఏ రమణ సదాశివ శ్రీనివాసులు నవీన్ గనేంద్ర సురేంద్ర మణికంఠ, తంబళ్లపల్లె మండల ఇన్చార్జి వేట మల్లికార్జున, గోపి దిన్నె మళ్ళీ, రమణప్ప, పేటీఎం మండల అధ్యక్షులు మబ్బు రామచంద్ర, కురబల కోట మండలం కో ఇన్చార్జి డేగాని కుమార్, తెట్టు శశి కుమార్, రామసముద్రం మండలం ఎంఎస్పి ఇన్చార్జి కొండప్ప, ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు ఎన్ శ్రీనివాసులు, వెంకటేష్, నిమ్మనపల్లి శేఖర్, పుంగనూరు మండలం కో ఇంచార్జ్ చదళ్ళ చిట్టి మరియు అన్నమయ్య జిల్లాలోని ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి