Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉక్రెయిన్ తీరంలో విషాదం.. క్షిపణి దాడిలో నలుగురు భారతీయ నావికులు దుర్మరణం

    ఉక్రెయిన్ తీరంలో విషాదం.. క్షిపణి దాడిలో నలుగురు భారతీయ నావికులు దుర్మరణం

    న్యూఢిల్లీ / ఉక్రెయిన్, 2026 జూలై 21:
    కార్గో నౌకపై ఘోర దాడి.. మరో భారతీయుడి పరిస్థితి విషమం.. ప్రపంచాన్ని కలచివేసిన ఘటన
    రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరోసారి అమాయక భారతీయుల ప్రాణాలను బలితీసుకుంది. ఉక్రెయిన్‌లోని ఒడెసా (Odesa) పోర్టు నుంచి ధాన్యం తరలిస్తున్న 'గోల్డెన్ లియో' (Golden Leo) కార్గో నౌకపై జరిగిన క్షిపణి దాడిలో నలుగురు భారతీయ నావికులు మృతి చెందగా, మరో భారతీయుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఈ వాణిజ్య నౌకలో భారతీయులు, సిరియా దేశానికి చెందిన సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒడెసా పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే నౌకపై వరుస క్షిపణులు పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.

    ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, అమాయక పౌరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. గాయపడిన భారతీయుడికి అత్యవసర వైద్య చికిత్స అందుతున్నట్లు, మృతుల వివరాలను వారి కుటుంబాలకు తెలియజేసేందుకు చర్యలు చేపట్టినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

    ఇవి కూడా చదవండి

    ఉక్రెయిన్ అధికారులు ఈ దాడికి రష్యా క్షిపణులే కారణమని ఆరోపిస్తుండగా, రష్యా నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. యుద్ధ ప్రభావం కారణంగా నల్ల సముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకల భద్రతపై అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

    అత్యధికంగా చదివినవి