Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వ్యభిచార నిర్మూలనపై చిత్తూరు జిల్లా పోలీసుల ఉక్కుపాదం

    Author RAJANEETHI | 18 Jul 2026, 06:24 PM | ANDHRA PRADESH
    వ్యభిచార నిర్మూలనపై చిత్తూరు జిల్లా పోలీసుల ఉక్కుపాదం

    చిత్తూరు, జూలై 18 (రాజనీతి): మహిళల అక్రమ రవాణా, వ్యభిచార నిర్వహణపై చిత్తూరు జిల్లా పోలీసులు జీరో టాలరెన్స్ విధానంతో కఠిన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ తెలిపారు. 2025 నుంచి ఇప్పటివరకు 13 కేసులు నమోదు చేసి 46 మందిని అరెస్టు చేయడంతో పాటు 18 మంది బాధిత మహిళలను రక్షించినట్లు వెల్లడించారు. హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు, అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, మహిళల అక్రమ రవాణా, వ్యభిచార నిర్వహణకు పాల్పడేవారిపై ఐటీపీఏతో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే డయల్-112కు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

    అత్యధికంగా చదివినవి