Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పుంగనూరు బైపాస్‌పై వరుస ప్రమాదాలు రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని డాక్టర్ పి. అయూబ్ ఖాన్ డిమాండ్

    పుంగనూరు బైపాస్‌పై వరుస ప్రమాదాలు  రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని డాక్టర్ పి. అయూబ్ ఖాన్ డిమాండ్

    పుంగనూరు, జూలై 18,రాజనీతి: పుంగనూరు పట్టణ బైపాస్ రోడ్డుపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై డాక్టర్ పి. అయూబ్ ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు మృత్యుకుహరంగా మారిందని, నిత్యం జరిగే ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు తీవ్ర గాయాలతో శాశ్వత వికలాంగులుగా మారుతున్నారని అన్నారు.
    ఇటీవల బైపాస్ రోడ్డుపై చోటుచేసుకున్న ఘోర ప్రమాదాలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు. బైపాస్ జంక్షన్ల వద్ద తగిన భద్రతా ప్రమాణాలు లేకపోవడం, హెచ్చరిక బోర్డులు, శాస్త్రీయ ప్రమాణాలతో స్పీడ్ బ్రేకర్లు, బ్లింకర్ లైట్లు, రాత్రి వేళల్లో సరిపడా వీధి దీపాల వెలుతురు లేకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్య ధోరణిని వీడి వెంటనే స్పందించాలని కోరారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో శాస్త్రీయంగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు స్పష్టమైన హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు అమర్చాలని సూచించారు. రాత్రి వేళల్లో ప్రయాణికుల భద్రత కోసం హైమాస్ట్ లైట్లు, వీధి దీపాలను పునరుద్ధరించాలని, ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.సంబంధిత మున్సిపల్ అధికారులు, జాతీయ రహదారుల శాఖ, పోలీసు యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ప్రజల ప్రాణాల రక్షణ కోసం స్థానికులు, స్వచ్ఛంద సంస్థలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డాక్టర్ పి. అయూబ్ ఖాన్ హెచ్చరించారు.

    అత్యధికంగా చదివినవి