Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పుత్తూరు అర్బన్ సీఐగా నెట్టికంటయ్య బాధ్యతల స్వీకరణ

    Author RAJANEETHI | 17 Jul 2026, 09:59 AM | ANDHRA PRADESH
    పుత్తూరు అర్బన్ సీఐగా నెట్టికంటయ్య బాధ్యతల స్వీకరణ

    (చిత్తూరు జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు జిల్లాలో టూ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన నెట్టికంటయ్య శుక్రవారం తిరుపతి జిల్లా పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయనకు ఈ పోస్టింగ్ లభించింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితి, పెండింగ్ కేసులు, నేరాల నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ నెట్టికంటయ్య మాట్లాడుతూ... ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తానన్నారు. పుత్తూరు అర్బన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఫిర్యాదుల పరిష్కారానికి పారదర్శకంగా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజల సహకారంతో నేరరహిత, ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు పోలీసులకు సహకరించాలని సీఐ నెట్టికంటయ్య విజ్ఞప్తి చేశారు.

    అత్యధికంగా చదివినవి