Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎస్‌ఎంఏ చిన్నారుల కోసం 16 కోట్ల మందు అందించాలని పాదయాత్ర

    Author RAJANEETHI | 16 Jul 2026, 04:30 PM | ANDHRA PRADESH
    ఎస్‌ఎంఏ చిన్నారుల కోసం 16 కోట్ల మందు అందించాలని పాదయాత్ర

    కంచికచర్ల, జూలై 16 (రాజనీతి): స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ)తో బాధపడుతున్న చిన్నారులకు రూ.16 కోట్ల విలువైన చికిత్సను ప్రభుత్వాలు అందించాలని కోరుతూ మహబూబ్‌నగర్‌కు చెందిన బయలుపాటి లక్కీ మహరాజ్ హైదరాబాద్ నుంచి మంగళగిరి వరకు పాదయాత్ర చేపట్టారు. గురువారం కంచికచర్ల చేరుకున్న ఆయనను జనసేన నాయకులు ఘనంగా సత్కరించారు. ఎస్‌ఎంఏ చికిత్సకు అవసరమైన ఔషధాన్ని భారతదేశంలోనే తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని లక్కీ మహరాజ్ తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి