Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల గడువు పొడిగింపు : చిత్తూరు జిల్లా డీఈఓ ఇన్‌చార్జి వెంకటేశ్వరరావు...

    Author RAJANEETHI | 12 Jul 2026, 01:41 PM | చిత్తూరు
    జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల గడువు పొడిగింపు : చిత్తూరు జిల్లా డీఈఓ ఇన్‌చార్జి వెంకటేశ్వరరావు...

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు గడువును జూలై 17 వరకు తుది దరఖాస్తు సమర్పణ గడువును జూలై 20 వరకు పొడిగించినట్లు చిత్తూరు జిల్లా డీఈఓ ఇన్‌చార్జి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖ అధికారులు (ఏంఈఓలు), ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ జాతీయ ఉపాధ్యాయ అవార్డుల పోర్టల్‌లో జూలై 17లోగా తమ దరఖాస్తులను నమోదు చేసుకుని జూలై 20లోగా తుది సమర్పణ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి మండలం నుంచి కనీసం ఒక ఉపాధ్యాయుడు జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు చేసుకునేలా ఏంఈఓలు ప్రోత్సహించాలని ఈ అవకాశంపై ఉపాధ్యాయులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ అన్ని అధికారిక వాట్సాప్ మెసేజ్ గ్రూపుల్లో సమాచారాన్ని పంపించాలని ఆదేశించారు.

    అత్యధికంగా చదివినవి