Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం - తల్లి బిడ్డ సురక్షితం

    బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం - తల్లి బిడ్డ సురక్షితం

    ప్రెస్ నోట్
    తేదీ:11-07-26
    *పిలేరు లో ప్రపంచ జనాబా దినోత్సము కార్యక్రమాలు*

    డా:శ్రీగిరీష

    ప్రణాళికబద్ధమైన మాతృత్వంతో సురక్షితమైన కుటుంబం సాధ్యమని ఇందుకు వివిధ కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన అవసరమని డా:శ్రీగిరీష డా:చంద్రశేఖర్ సంయుక్తంగా తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పిహెచ్ సి తలుపుల ప్రదానవైద్యాధికారులు ఆధ్వర్యంలో పీలేరు పట్టణ కోటపల్లెలో "బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం - తల్లి బిడ్డ సురక్షితం"అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

    కుటుంబ నియంత్రణ అనేది దంపతులు తమ జీవితంలో తీసుకునే అత్యంత గణనీయమైన ఆరోగ్య , నిర్ణయాలలో ఒకటని,

    గర్భధారణ మధ్య సరైన విరామం పాటించడం వల్ల అనుకోకుండా కలిగే గర్భధారణలను నివారించడమే కాకుండా,
    తల్లికి,శిశువుకు,కుటుంబానికి,సమాజానికి కలిగే ప్రయోజనాలు గూర్చి డా:శ్రీగిరీష దంపతులకు వివరించారు.

    దంపతులు వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి,
    ,గర్భధారణ సంబంధిత అనారోగ్యాల నుండి రక్షించుకోవడానికి,
    ఆధునిక గర్భ నిరోధక పద్ధతులపై అవగాహన అందరికి అవసరమని, అర్హులైన దంపతులకు డా: చంద్రశేఖర్ వివరించారు. తర్వాత ప్రతిజ్ఞ మరియు ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు.

    కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ఇఓ కొండయ్య,పిహెచ్ యన్ కుసుమ, శ్రీనువాసులు, నాగమ్మ , ఏఎన్ఎం అరుణ,నూర్జహన్ సిహెచ్ఓ
    సౌజన్య,అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు గర్భిణి స్త్రీలు,పాలిచ్చు తల్లులు,కిషోర్ బాలికలు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి