Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వెలగని వీధి దీపాలు

    Author RAJANEETHI | 11 Jul 2026, 12:47 PM | ANDHRA PRADESH, ఆంధ్రప్రదేశ్
    వెలగని వీధి దీపాలు

    అన్నమయ్య జిల్లా, రాజనీతి,పుంగనూరు నియోజకవర్గం, మండల కేంద్రమైన సోమల లో గత పది రోజుల నుంచి సోమల - నంజంపేట మార్గంలో బస్టాండ్ వరకు ఉన్న వీధిలైట్లు వెలగలేదని(ఇందులో ఒక్క వీధిలైట్ మాత్రం వెలుగుతుంది) అదేవిధంగా బస్టాండ్ నుంచి సంత గేట్ వరకు ఉన్న వీధిలైట్లు వెలగలేదని శుక్రవారం రాత్రి స్థానికులు తెలియజేశారు. బస్టాండ్ కూడలిలో సోలార్ లైట్ లేకపోతే ఆ ప్రాంతమంతా చీకటిమయంగా మారిపోయేది. వీధిలైట్లు లేకపోవడంతో తాము పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బస్టాండ్ నుంచి నంజంపేటకు వెళ్లేటువంటి మార్గంలో రోడ్డుపై అక్కడక్కడ చిన్నపాటి గోతులు కూడా ఉండడంతో పాదచారులు, వాహనదారులు పడిపోయి అవకాశం కూడా లేకపోలేదు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

    అత్యధికంగా చదివినవి