Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కడప ఐ&పిఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్‌ను కలిసిన ‘తాజావార్త’ ఎడిటర్ మామిడి యల్లారెడ్డి

    Author RAJANEETHI | 09 Jul 2026, 04:37 PM | ANDHRA PRADESH
    కడప ఐ&పిఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్‌ను కలిసిన ‘తాజావార్త’ ఎడిటర్ మామిడి యల్లారెడ్డి

    కడప, జూలై 9 : కడప జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) అసిస్టెంట్ డైరెక్టర్ (AD) ఏ. రమేష్‌ను ‘తాజావార్త’ పత్రిక ఎడిటర్ యల్లారెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏడి రమేష్‌ను ఆయన శాలువాతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏడి ఏ. రమేష్ మాట్లాడుతూ… ప్రభుత్వ సమాచారాన్ని, ప్రజా ఉపయోగకర కార్యక్రమాలను సకాలంలో ప్రజలకు చేరవేయడంలో ముద్రణా, ఎలక్ట్రానిక్ మీడియా సహకారం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా ఒక బలమైన వారధిగా పనిచేయాలని, నిరంతరం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో పత్రికలు ముందుండాలని ఆయన ఆకాంక్షించారు.

    అత్యధికంగా చదివినవి