Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పీలేరు నియోజకవర్గంలో ఫుడ్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు గురుకుల పాఠశాలల్లో ఆహార నాణ్యత, గుడ్ల సరఫరాపై పరిశీలన

    పీలేరు నియోజకవర్గంలో ఫుడ్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు గురుకుల పాఠశాలల్లో ఆహార నాణ్యత, గుడ్ల సరఫరాపై పరిశీలన

    పీలేరు, జూలై 7: అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఫుడ్ కమిషనర్ జి. గంజిమ్ల దేవి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

    వాయల్పాడు మండలంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించిన ఆమె, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, వంటశాల పరిశుభ్రత, గుడ్ల సరఫరా, నిల్వ విధానాలను పరిశీలించారు.

    తనిఖీల సందర్భంగా కొన్ని గడువు ముగిసిన (ఎక్స్‌పైరీ) నూనె ప్యాకెట్లు గుర్తించిన అధికారులు వాటిపై సంబంధిత సిబ్బందిని వివరణ కోరారు. అలాగే హాస్టల్‌కు సరఫరా చేస్తున్న గుడ్ల నాణ్యత, సరఫరా రికార్డులను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆదేశించారు. అవసరమైన చోట షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    ఈ తనిఖీల్లో డీఎం సుమతి, డీఎస్ఓ రెడ్డి చంద్రిక, ఎంఈవో బాబు నాయక్, ఎస్సీ, ఎస్టీ జిల్లా కోఆర్డినేటర్ శైలజ, పద్మావతి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులు పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

    అత్యధికంగా చదివినవి