Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తొమ్మిది మంది పేకాటరాయుళ్ల అరెస్ట్.

    తొమ్మిది మంది పేకాటరాయుళ్ల అరెస్ట్.

    కె.వి.పల్లి, జూలై 6, రాజనీతి:

    కె.వి.పల్లి మండలం చెరువుముందరపల్లి గ్రామ సమీపంలోని మామిడి తోటలో అక్రమంగా పేకాట నిర్వహిస్తున్న వారిపై కె.వి.పల్లి పోలీసులు సోమవారం దాడి నిర్వహించారు. ఈ దాడిలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ బి.వెంకట శివకుమార్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.10,100 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు, తొమ్మిది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తెలిపారు. జూదం, పేకాట వంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు. ప్రజలు అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

    అత్యధికంగా చదివినవి