Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేణిగుంట సబ్‌డివిజన్‌లో నెల రోజులపాటు సెక్షన్-30 అమలు

    Author RAJANEETHI | 04 Jul 2026, 08:41 PM | ANDHRA PRADESH
    రేణిగుంట సబ్‌డివిజన్‌లో నెల రోజులపాటు సెక్షన్-30 అమలు

    శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలను నివారించేందుకు రేణిగుంట సబ్‌డివిజన్ పరిధిలో జూలై 1 నుంచి 31 వరకు సెక్షన్-30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని డీఎస్పీ శ్రీనివాసరావు ప్రకటించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, ఇతర సామూహిక కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. రేణిగుంట, గాజులమండ్యం, ఏర్పేడు, రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేల్, పుల్లంపేట, పెనగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ప్రజలు పోలీసు శాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.