Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎస్ఐఆర్-2026 ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్

    Author RAJANEETHI | 03 Jul 2026, 12:37 PM | ANDHRA PRADESH
    ఎస్ఐఆర్-2026 ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్

    రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామనగర్‌లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్-2026) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, బీఎల్‌ఓలను సర్వే నిర్వహణ, ఫారాల పంపిణీ, ఓటర్ల నమోదు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా పారదర్శకంగా, నిర్దిష్ట గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన వివరాలు అందించాలని కలెక్టర్ సూచించారు.

    అత్యధికంగా చదివినవి