Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రమాదంలో గాయపడిన టీడీపీ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే కిషోర్

    ప్రమాదంలో గాయపడిన టీడీపీ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే కిషోర్

    కలికిరి మండలం గుట్టపాలెం గ్రామం యల్లంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త మల్లికార్జున గౌడ్ ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడడంతో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బుధవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

    ఈ సందర్భంగా గాయపడిన మల్లికార్జున గౌడ్‌ను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి, ఆరోగ్య పరిస్థితిని, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

    ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మల్లికార్జున గౌడ్ మన పార్టీకి అంకితభావంతో పనిచేసిన నిబద్ధత గల కార్యకర్త. ఆయనకు ఇలా ప్రమాదం జరగడం బాధాకరం. ధైర్యంగా ఉండాలి. త్వరగా కోలుకొని తిరిగి మామూలు జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.

    ఇవి కూడా చదవండి

    కార్యకర్తలు పార్టీకి కుటుంబ సభ్యులతో సమానం. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం నా బాధ్యత. వైద్యానికి ఏ సహాయం కావాలన్నా నేను అండగా ఉంటాను. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తానని భరోసా ఇచ్చారు.

    నువ్వు త్వరగా కోలుకొని మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. నీలాంటి కార్యకర్తలే పార్టీకి బలమని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్తులు, కార్యకర్తలు, నల్లారి అభిమానులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి