Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రూ.2.50 లక్షల విలువైన పీడీఎస్ బియ్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

    Author RAJANEETHI | 30 Jun 2026, 03:56 PM | ANDHRA PRADESH
    రూ.2.50 లక్షల విలువైన పీడీఎస్ బియ్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

    అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని రేణిగుంట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో, సీఐ జయచంద్ర ఆదేశాల మేరకు ఎస్సై శ్రీనివాసులు చెంగారెడ్డిపల్లి క్రాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. వారి వద్దనున్న వాహనం, గోదాములో కలిపి మొత్తం 226 బస్తాల్లో 11,120 కిలోల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.2.50 లక్షలు. శ్రీకాళహస్తికి చెందిన వ్యక్తి ఆదేశాల మేరకు పేదలకు పంపిణీ చేసే బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి తమిళనాడుకు తరలించేందుకు నిల్వ చేసినట్లు విచారణలో తేలింది. నిందితులపై కేసు నమోదు చేసి బియ్యాన్ని రెవెన్యూ శాఖకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

    రూ.2.50 లక్షల విలువైన పీడీఎస్ బియ్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ - Additional Image
    అత్యధికంగా చదివినవి