Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న కంచి సూరిని పరామర్శించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

    అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న కంచి సూరిని పరామర్శించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

    అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న కంచి సూరిని పరామర్శించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి


    ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

    తెలుగుదేశం పార్టీ పీలేరు పట్టణ అధ్యక్షులు దలవాయి సురేష్ కుమార్ రెడ్డి @ కంచి సూరి ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.

    ఇవి కూడా చదవండి

    సోమవారం పీలేరు పట్టణం ఇందిరమ్మ కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కంచి సూరిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సూరి పార్టీకి సీనియర్ నాయకులు. పట్టణ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలోకి రావాలని కోరుకుంటున్నానని సూచించారు.

    పీలేరు పట్టణంలోని యలమంద క్రాస్ కావలి పల్లికి చెందిన టిడిపి నాయకులు అనీఫ్ సతీమణి షకీలా అనారోగ్యంతో ఉండడంతో ఆమెను పరామర్శించి ఆమె ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు.

    ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కంచి సూరి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి