Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్ అంధకారమే: - అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారు.

    డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్ అంధకారమే: - అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారు.

    పత్రికా ప్రకటన
    తేదీ: 26.06.2026
    అన్నమయ్య జిల్లా - మదనపల్లి

    మదనపల్లెలో 'యాంటీ డ్రగ్', అవగాహన సదస్సు.

    💠డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్ అంధకారమే: - అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారు.

    అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ఆవరణంలో శుక్రవారం ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారి ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజలతో కలిసి భారీ అవగాహన సదస్సు, నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ....

    ఇవి కూడా చదవండి

    మాదకద్రవ్యాలు సేవించినా, విక్రయించినా కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తాం. డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోవడంతో పాటు పాస్‌పోర్ట్ కూడా లభించదు.

    పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో 'కూల్ లిప్స్' లాంటివి అమ్మితే కఠిన చర్యలు తప్పవు. ఉపాధ్యాయులు సైతం అప్రమత్తంగా ఉండి విద్యార్థుల బ్యాగులను తనిఖీ చేయాలి.

    ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లకు 'డ్రగ్ టెస్టింగ్ కిట్స్' సరఫరా చేశాం. అనుమానితులకు తనిఖీలు చేసి, డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.

    మత్తు పదార్థాల విక్రయాలపై ప్రజలు నిర్భయంగా 1972 కు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతాం.

    మత్తు రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని అదనపు ఎస్పీ శ్రీ ఎం.వెంకటాద్రి గారు కోరారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల చేత మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.

    ఇదే స్ఫూర్తితో జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ యాంటీ డ్రగ్ ర్యాలీలను విజయవంతంగా నిర్వహించారు.
    👇
    అన్నమయ్య పోలీస్

    అత్యధికంగా చదివినవి