Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో క్యాంటీన్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం

    Author RAJANEETHI | 24 Jun 2026, 01:36 PM | ANDHRA PRADESH, ఆంధ్రప్రదేశ్
    జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో క్యాంటీన్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం

    జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో క్యాంటీన్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం

    అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం, మదనపల్లె ప్రాంగణంలో క్యాంటీన్ నిర్వహణకు ఆసక్తి గల వ్యక్తులు, సంస్థల నుండి టెండర్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

    కార్యాలయానికి వచ్చే అధికారులు, ఉద్యోగులు, సందర్శకులు మరియు ప్రజలకు నాణ్యమైన ఆహార సేవలు అందించే ఉద్దేశంతో క్యాంటీన్ నిర్వహణ చేపట్టనున్నట్లు తెలిపారు. టెండర్ నిబంధనల ప్రకారం క్యాంటీన్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు టెండర్ పొందిన వ్యక్తి లేదా సంస్థ స్వంత వ్యయంతో చేపట్టవలసి ఉంటుంది. నాణ్యమైన ఆహార పదార్థాలు, పరిశుభ్రత, సేవా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని సూచించారు.

    ఇవి కూడా చదవండి

    ఆసక్తి గల అభ్యర్థులు 24-06-2026 నుండి 29-06-2026 సాయంత్రం వరకు తమ టెండర్ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ కార్యాలయం, మదనపల్లెలో సమర్పించవచ్చని తెలిపారు. టెండర్ల పరిశీలన 30-06-2026 ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించబడుతుందని, ఏ టెండర్‌నైనా కారణం చూపకుండా అంగీకరించే లేదా తిరస్కరించే పూర్తి హక్కు జిల్లా పరిపాలనకు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఏదేని ఇతర వివరాలకు కలెక్టర్ వారి కార్యాలయంలో సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

    అత్యధికంగా చదివినవి