Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అంగన్వాడీ కేంద్రాల్లో ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం తప్పనిసరి చేయాలి – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

    అంగన్వాడీ కేంద్రాల్లో ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం తప్పనిసరి చేయాలి – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

    మదనపల్లె, జూన్ 23:

    అన్నమయ్య జిల్లాలోని మొత్తం 1,792 అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇండక్షన్ స్టవ్‌లు మరియు వంట పాత్రలు సరఫరా చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.

    మంగళవారం మదనపల్లె కలెక్టరేట్‌లోని చాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రామసముద్రం అంగన్వాడీ కార్యకర్తలకు కలెక్టర్ చేతుల మీదుగా ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేశారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఆధునిక వంట సౌకర్యాలు అందించడం ప్రభుత్వ సంక్షేమ దృక్పథానికి నిదర్శనమన్నారు. ఇండక్షన్ స్టవ్‌ల వినియోగంతో వంట ప్రక్రియ సులభతరం కావడంతో పాటు సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.

    అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందజేసిన ఇండక్షన్ స్టవ్‌లను తప్పనిసరిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సీడీపీవోలు, సూపర్వైజర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రాల స్థాయిలో నిరంతర పర్యవేక్షణ నిర్వహించి సమర్థవంతంగా అమలు జరిగేలా చూడాలని సూచించారు.

    అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు.

    ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి హైమావతి, సిడిపివోలు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
    -----------------------////--------------------------
    డిఐపిఆర్ఓ, అన్నమయ్య జిల్లా

    అత్యధికంగా చదివినవి