Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 16 ఏళ్ల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం – "ఉద్యోగుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చిత్తూరు జిల్లా గళం"

    16 ఏళ్ల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం – "ఉద్యోగుల సమస్యలపై  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చిత్తూరు జిల్లా గళం"

    ✊ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో మరో కీలక ముందడుగు ✊

    నేడు మధ్యాహ్నం ఒంటిగంటలకు చిత్తూరు జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ , జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ సుమిత్ కుమార్ గారి అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించబడింది. మెంబర్ సెక్రటరీ జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ మోహన్ కుమార్ గారు పాల్గొన్న ఈ సమావేశానికి 19 సభ్య సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.

    ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ఎల్లప్పుడూ అగ్రగామిగా నిలిచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులసంఘం ఈ సమావేశంలోనూ తన ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని చాటుకుంది. సంఘ జిల్లా అధ్యక్షులు వి శివయ్య గారు జిల్లాలో ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను మరియు ముఖ్యంగా ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(EHS) చిత్తూరు జిల్లాలోని వివిధ డిపార్ట్మెంటల్ యందు పెండింగులో ఉన్న పదోన్నతుల ప్రక్రియ. (DPC) వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మరణించిన వారి పిల్లలకు కారుణ్య నియామకాలు ద్వారా ఉద్యోగ నియామకాలు ఇవ్వాలని కోరారు. మరి ముఖ్యంగా ఉద్యోగుల బకాయిలు దాదాపు 35 వేల కోట్లు పెండింగులు ఉన్నాయి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు ప్రతిపాదించిన రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమంలో పొందుపరిచిన బకాయిలకు బదులు భూమి కేటాయించాలని కోరారు
    సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన జిల్లా రెవెన్యూ అధికారి గారు, అందిన వినతులు మరియు ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి, త్వరలో అన్ని శాఖల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ తో ప్రత్యేక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

    ఇవి కూడా చదవండి

    దాదాపు 16 సంవత్సరాల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ బాబు, జిల్లా కోశాధికారి ఏం దేవకుమార్,జిల్లా జాయింట్ సెక్రెటరీ శ్రీ చలపతి,రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఎస్ రెడ్డమ్మ,జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి శైలజ,చిత్తూరు తాలూకా సెక్రటరీ పయని ఉపాధ్యక్షులు శ్రీమతి సౌజన్య, శ్రీమతి విజయ్ కుమారి బంగారుపాళ్యంతాలూకా అధ్యక్షులు శ్రీ సురేంద్ర నాథ్ రెడ్డి, తదితర సభ్యులు పాల్గొన్నారు.

    ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కార మార్గాలను చూపిస్తూ, ప్రతి ఉద్యోగికి అండగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంఘం మరోసారి తన కార్యదీక్షను, సంఘ బలాన్ని, నాయకత్వ సామర్థ్యాన్ని చాటుకుంది.

    “ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం... సమస్యల పరిష్కారమే ధ్యేయం...”
    ఇట్లు
    వి.శివయ్య
    జిల్లా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చిత్తూరు జిల్లా

    అత్యధికంగా చదివినవి