Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యే జీవితాన్ని మార్చే శక్తి..... కలెక్టర్...ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు – ప్రశంసాపత్రాలు

    Author RAJANEETHI | 23 Jun 2026, 12:39 PM | ANDHRA PRADESH
    విద్యే జీవితాన్ని మార్చే శక్తి..... కలెక్టర్...ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు – ప్రశంసాపత్రాలు

    విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా సమాజాభివృద్ధికి బలమైన పునాది వేయవచ్చని జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థిక ప్రోత్సాహం అందించడం విద్యా రంగంలో సానుకూల మార్పులకు దోహదపడుతుందని పేర్కొన్నారు. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ప్రశంసాపత్రాల ప్రదానోత్సవ కార్యక్రమం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఎంపికైన 8 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున స్కాలర్‌షిప్ చెక్కులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయాలు వారి కుటుంబాలకు మాత్రమే కాకుండా సమాజానికి కూడా గర్వకారణమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కృషి చేస్తే అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు. విద్యార్థుల జీవితాల్లో స్కాలర్‌షిప్‌లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అవి మరింత ఉన్నతంగా ఎదగడానికి ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో గుర్తింపు పొందేలా చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో జ్ఞానం, నైపుణ్యాలు, క్రమశిక్షణ అత్యంత కీలకమని తెలిపారు. చిన్న విజయాలతో ఆగిపోకుండా ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, ఉద్యోగ అవకాశాల వైపు అడుగులు వేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషిని గుర్తుంచుకుని మరింత కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. స్కాలర్‌షిప్‌లు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ తమ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన జిల్లా యంత్రాంగానికి, క్రెడిట్ యాక్సెస్ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రోత్సాహం తమకు మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో మరింత ఉన్నత ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. స్కాలర్‌షిప్‌లు అందుకున్న విద్యార్థుల్లో చంద్రగిరికి చెందిన ఎస్. ప్రణవి, సాయి హర్షిణి,ఎన్. అక్షయ్, రైల్వే కోడూరుకు చెందిన పీ. మోక్షిత, ఎస్. సురేఖ శ్రావణి
    వెంకటగిరికి చెందిన సి.హెచ్. రోహిత్, శ్రీకాళహస్తికి చెందిన ఎన్. జెస్సిక, జె. సుబ్రహ్మణ్యమ్మ
    ఉన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్ డివిజనల్ మేనేజర్ ఎం. జగదీష్, లియాజన్ ఆఫీసర్ ఎస్. ఆరిఫుల్లా, ఏరియా మేనేజర్లు ఈ. సిద్ధారెడ్డి, వై. సత్యనారాయణ, విద్యార్థులు, తల్లిదండ్రులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

    విద్యే జీవితాన్ని మార్చే శక్తి..... కలెక్టర్...ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు – ప్రశంసాపత్రాలు - Additional Image
    అత్యధికంగా చదివినవి