Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టి. బి. రాకుండా ప్రతి ఒక్కరి సంరక్షణ మా భాద్యత. డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ

    టి. బి. రాకుండా ప్రతి ఒక్కరి సంరక్షణ మా భాద్యత. డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ

    వాయల్పాడు 20/6/26
    టి. బి. (క్షయ )వ్యాధి సోకకుండా, రాకుండా ప్రతీ పౌరుడిని సంరక్షించి కాపాడటం మా భాద్యత అని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర మరియు 104సేవలలో భాగంగా మూరెవాoడ్ల పల్లి కి హాజరైన ప్రజలకు టి. బి వ్యాధి, అతిసార వ్యాధి, మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు, పల్స్ పోలియో పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుచు టి. బి. ముక్త్ భారత్ కార్యక్రమం లో ముందుగా ప్రతీ ఒక్కరూ అనగా నిర్దేశించిన వారు 60సంవత్సరాల పై బడిన వారు, షుగర్ ఉన్న వారు, పౌష్టికాహర లోపం తో బలహీనంగా ఉన్నవారు, పొగ, ఆల్కహాల్ త్రాగువారు, మంచానికే పరిమితమై బాగాలేని వారు, కిడ్నీ, క్యాన్సర్ రోగులు, గతం లో టి. బి. వచ్చి నయం అయినవారు, ప్రస్తుతం టి. బి. చికిత్స లో ఉన్న రోగుల కాంటాక్ట్స్, గర్భవతులు, తప్పనిసరిగా గళ్ళ పరీక్షలు చేయించుకుని ఒకవేళ టి. బి. నిర్ధారణ ఐతే ఆరు నెలల పాటు ఉచితంగా చికిత్స ఇవ్వడం జరుగుతుంది అన్నారు. పై తెలుపబడిన కేటగిరి వారు తప్పకుండ పరీక్షలు చేయించుకుని లబ్ది పొందాలని అన్నారు. చికిత్స కాలం లో ప్రధానమంత్రి పోషన్ అభియాన్ పథకం కింద నెలకు రూ 1000/-వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అన్నారు. అనంతరం టి. బి. ప్రతిజ్ఞ చేయించి కరపత్రాలు పంపిణీ చేశారు. జూన్ 28వతేది నిర్వహించు పల్స్ పోలియో కార్యక్రమం లో అపుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలఅందరికి పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. స్టాప్ డయేరియా కార్యక్రమం లో భాగంగా చేతులు శుభ్రత పాటించాలని, మరుగుదొడ్లు వాడాలని, నీరు కాచి చల్లార్చినవే త్రాగాలని, తాజాగా వండిన ఆహరం తినాలని, ఆహార పదార్థలపై మూతలు ఉంచాలని, ఓ. ఆర్. ఎస్ ప్రాముఖ్యత పై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. జూన్ నెల మలేరియా వ్యతిరేక మాసంగా నిర్వహించడం జరుగుతుంది అని దోమలు వృద్ధి చెందకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రతీ శుక్రవారం పొడి దినంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, ఎమ్. ఎల్. హెచ్. పి. పుష్పావతి, ఏ. ఎన్. ఎమ్. అనసూయ, ఆశాకార్యకర్తలు సుబ్బలక్ష్మి, శ్యామల, రమాదేవి, 104సిబ్బంది కేశవ, ఆయేష మరియు ప్రజలు పాల్గొన్నారు.