Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై రాజకీయ పార్టీలతో సమావేశం

    Author RAJANEETHI | 19 Jun 2026, 09:54 PM | ANDHRA PRADESH
    పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై రాజకీయ పార్టీలతో సమావేశం

    స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026లో భాగంగా 167 తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి (ఈఆర్ఓ) శారదా దేవి తెలిపారు. 1200 మందికి పైగా ఓటర్లు ఉన్న కేంద్రాలను విభజించి 84 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. వాటిపై అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని కోరగా, ఇప్పటికే సమర్పించిన ప్రతిపాదనలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. సమావేశంలో ఏఈఆర్ఓలు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.