Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నేరాల నియంత్రణకే పోలీసుల పల్లె నిద్ర..... సిఐ మంజునాథ్ రెడ్డి

    Author RAJANEETHI | 19 Jun 2026, 09:46 PM | ANDHRA PRADESH
    నేరాల నియంత్రణకే పోలీసుల పల్లె నిద్ర..... సిఐ మంజునాథ్ రెడ్డి

    నేరాల నియంత్రణకే పోలీసులు పల్లె నిద్రలు చేస్తున్నారని రేణిగుంట రూరల్‌ సీఐ మంజునాథ్ రెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు డిఎస్పి శ్రీనివాసరావు సూచనలతో శుక్రవారం రాత్రి రేణిగుంట మండలం ఎల్లమండ్యం హెచ్.డబ్ల్యు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ వినియోగం, పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపువంటి అంశాలపై మహిళలకు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీలు, డెబిట్‌కార్డుల నెంబర్లు ఎవరికి చెప్పవద్దన్నారు. యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, క్రమ శిక్షణతో చదువుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాజులమండ్యం పోలీసు సిబ్బంది, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.