Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మెరుగైన ఆరోగ్య సేవలతో పల్లె క్షేమం నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (పీలేరు యంయల్ఏ)

    మెరుగైన ఆరోగ్య సేవలతో పల్లె క్షేమం నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (పీలేరు యంయల్ఏ)

    మెరుగైన ఆరోగ్య సేవలతో పల్లె క్షేమం
    నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (పీలేరు యంయల్ఏ)
    సకాలంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల్ని అధిగమించి నియోజకవర్గ ర్యాంకింగ్ మెరుగుపర్చలని పీలేరు నియోజకవర్గ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వైద్య సిబ్బందికి సూచనలిచ్చారు.
    శుక్రవారం పీలేరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి అన్ని విభాగాల అధికారులతో సాధించాల్సిన ప్రగతికి మెరుగైన సూచన సలహాలు ఇస్తూ
    అందులోభాగంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము తలుపుల ,మరియు రేగల్లు ప్రధాన వైద్యాధికారులు డా:రాధ మాధవి,డా:శ్రీగిరీష గారిచే రక్తపోటు నిర్దారణ పరీక్షలు చేసుకుని కొన్ని ఆరోగ్య సందేహాలు నివృత్తి చేసుకున్నారు.తర్వాత యం యల్ ఏ గారు వైద్యాధికా రులకు సూచనలిస్తు పల్లె ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడ ఉత్పన్న మయ్యే ఆరోగ్య సమస్యలకై తక్షణమే స్పందించి సమస్యలు సమసి పోయేటట్లు కృషి చేయాలని వైద్యాధికారులకు సూచన లిచ్చారు.
    కార్యక్రమంలో పి.హెచ్.సి రేగల్లు,తలుపుల ప్రదానవైద్యాధికారులు డా:శ్రీగిరీష,డా:రాధమాధవి,పి.హెచ్.యన్ కుసుమ, పర్యవేక్షణ అధికారులు చిన్నప్ప,నాగమ్మ, ఏయన్ యం లు విజయ, అరుణ,ధనుంజయమ్మ,సి.హెచ్ .ఓ లు అయేషా, సౌజన్య,ఆశా కార్యకర్తలు పాల్గోన్నారు.