Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సారధి పోర్టల్ సమస్యలు పరిష్కారం.. ఎల్‌ఎల్‌ఆర్ సేవలు పునఃప్రారంభం

    Author RAJANEETHI | 18 Jun 2026, 05:19 PM | ANDHRA PRADESH
    సారధి పోర్టల్ సమస్యలు పరిష్కారం.. ఎల్‌ఎల్‌ఆర్ సేవలు పునఃప్రారంభం

    రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా సారధి పోర్టల్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన లెర్నర్స్ లైసెన్స్ సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు జిల్లా రవాణా శాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. ప్రస్తుతం ఎల్‌ఎల్‌ఆర్ దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, అనుమతుల జారీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. డ్రైవింగ్ నైపుణ్య పరీక్షలు కూడా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయని, ఇప్పటికే స్లాట్‌లు బుక్ చేసుకున్న అభ్యర్థులు సంబంధిత కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు. సేవలు పొందలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.