Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్వర్ణముఖి ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు

    Author admin | 18 Jun 2026, 04:14 PM | ANDHRA PRADESH
    స్వర్ణముఖి ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు

    స్వర్ణముఖి నదిలో జరిగిన విషాద ఘటనలో మృతి చెందిన నలుగురు బాలుర కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా మంజూరైన పరిహారం చెక్కులను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి గురువారం అందజేశారు. ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ప్రకటించిన సహాయంలో మిగిలిన మొత్తాన్ని పంపిణీ చేసి పూర్తి పరిహారం అందించారు. పిల్లలను కోల్పోయిన కుటుంబాల బాధను ప్రభుత్వం అర్థం చేసుకుంటోందని, అవసరమైన సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.