Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చేపల మార్కెట్‌లో కుళ్లిన చేపల కలకలం.. రెండు దుకాణాలు సీజ్

    Author admin | 18 Jun 2026, 11:55 AM | ANDHRA PRADESH
    చేపల మార్కెట్‌లో కుళ్లిన చేపల కలకలం.. రెండు దుకాణాలు సీజ్

    తిరుపతి నగరంలోని లీలామహల్ చేపల మార్కెట్‌లో కుళ్లిన చేపలు, రొయ్యలు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై నగరపాలక సంస్థ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో షాప్ నంబర్ 9, 10లో సుమారు 150–200 కిలోల మేర చెడిపోయి దుర్వాసన వెదజల్లుతున్న చేపలు, రొయ్యలు గుర్తించారు. ఫ్రీజర్లలో పరిశుభ్రత లేక పురుగులు పట్టినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నిల్వలను డంపింగ్ యార్డుకు తరలించి, సంబంధిత రెండు దుకాణాల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేసి సీజ్ చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

    చేపల మార్కెట్‌లో కుళ్లిన చేపల కలకలం.. రెండు దుకాణాలు సీజ్ - Additional Image