Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తల్లిదండ్రులే నా ప్రపంచం.. వారి జ్ఞాపకార్థం అన్నదానం: న్యాయవాది చంద్రమౌళి

    తల్లిదండ్రులే నా ప్రపంచం.. వారి జ్ఞాపకార్థం అన్నదానం: న్యాయవాది చంద్రమౌళి

    తిరుపతి(రాజనీతి): తల్లిదండ్రులపై ఉన్న అపారమైన ప్రేమ, అభిమానానికి గుర్తుగా చంద్రమౌళి న్యాయవాది తన తల్లి వి. విజయలక్ష్మి 9వ వర్ధంతి సందర్భంగా గురువారం తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని అభయక్షేత్రం (ప్రత్యేక అవసరాలు గల వ్యక్తుల పునరావాస కేంద్రం)లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలో ఉన్న వారికి వివిధ రకాల ఆహార పదార్థాలను అందించి తన తల్లి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.తల్లిదండ్రులపై తనకున్న ప్రేమకు గుర్తుగా కొన్ని సంవత్సరాల క్రితం వారి స్వగ్రామంలో సొంత స్థలంలో తల్లిదండ్రుల విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని, వారు భౌతికంగా దూరమైనా వారి జ్ఞాపకాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయని పేర్కొన్నారు. వారి పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని చంద్రమౌళి తెలిపారు. తల్లిదండ్రుల వర్ధంతులను సేవా కార్యక్రమాల ద్వారా గుర్తుచేసుకోవడం సమాజానికి మేలు చేస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.