Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి

    Author RAJANEETHI | 11 Oct 2026, 03:51 PM | ANDHRA PRADESH
    స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి

    మదనపల్లె అక్టోబర్ 11(రాజనీతి): అన్నమయ్య జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌లో పోలింగ్ కేంద్రాల తనిఖీలు, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, చెక్‌పోస్టుల ఏర్పాటు, కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్లు నిర్వహించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలని, లైసెన్స్‌ ఆయుధాలను డిపాజిట్‌ చేయించాలని ఆదేశించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.