Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • షర్మిల అరెస్టు పిరికిపంద చర్య: దుబ్బా శ్రీకాంత్

    Author RAJANEETHI | 10 Oct 2026, 04:25 PM | ANDHRA PRADESH
    షర్మిల అరెస్టు పిరికిపంద చర్య: దుబ్బా శ్రీకాంత్

    పీలేరు అక్టోబర్ 10 (రాజనీతి): ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలను నిరసిస్తూ చేపట్టిన ‘చలో రాజ్‌భవన్‌’ కార్యక్రమాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని అన్నమయ్య జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు దుబ్బా శ్రీకాంత్‌ విమర్శించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను గృహనిర్బంధం చేయడాన్ని ఖండించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అరెస్టులతో కాంగ్రెస్‌ పోరాటాన్ని ఆపలేరని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మల్లెల రెడ్డి, బాషా, షేక్‌ ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.