Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రక్తహీనత నివారణకు పౌష్టికాహారం అవసరం

    Author RAJANEETHI | 09 Oct 2026, 03:44 PM | ANDHRA PRADESH
    రక్తహీనత నివారణకు పౌష్టికాహారం అవసరం

    వాయల్పాడు అక్టోబర్ 9 (రాజనీతి): గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు రక్తహీనతకు గురికాకుండా పౌష్టికాహారం తీసుకోవాలని డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్‌ రఫీ సూచించారు. శుక్రవారం సేవా సంకల్ప అభియాన్‌లో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆయన మాట్లాడుతూ ఆకుకూరలు, కూరగాయలు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష వంటి ఐరన్‌ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కుక్కకాటు, పాముకాటు జరిగినప్పుడు తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలని, నాటు వైద్యాన్ని ఆశ్రయించరాదని తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.