Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టీబీ ముక్త్‌ భారత్‌ లక్ష్య సాధనకు జోష్‌ బృందాలు

    Author RAJANEETHI | 08 Oct 2026, 05:47 PM | ANDHRA PRADESH
    టీబీ ముక్త్‌ భారత్‌ లక్ష్య సాధనకు జోష్‌ బృందాలు

    గుర్రంకొండ అక్టోబర్ 8 (రాజనీతి): టీబీ ముక్త్‌ భారత్‌ లక్ష్య సాధనలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం జోష్‌ (పూర్తి ఆరోగ్యం కోసం సంయుక్త బృందాలు) ఏర్పాటు చేసిందని డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్‌ రఫీ తెలిపారు. తరిగొండ పీహెచ్‌సీ పరిధిలోని మర్రిపాడు ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌లో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ప్రజలకు టీబీపై అవగాహన కల్పించారు. రెండు వారాలకు పైగా దగ్గు, ఛాతినొప్పి, బరువు తగ్గడం, సాయంత్రం జ్వరం వంటి లక్షణాలుంటే సమీప పీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ నిర్ధారణైతే ఉచిత చికిత్స అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.