Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

    Author RAJANEETHI | 05 Oct 2026, 06:35 PM | ANDHRA PRADESH
    కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

    మదనపల్లె అక్టోబర్ 5 (రాజనీతి): ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్‌, పెస్ట్‌ కంట్రోల్‌, సెక్యూరిటీ కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జీవో 138 ప్రకారం రూ.18,600 వేతనం చెల్లించాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సక్రమంగా జమ చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.