Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అండర్‌-17 క్రికెట్‌ జట్టుకు మహేష్‌..చిత్తూరు ఎమ్మెల్యే అభినందనలు

    అండర్‌-17 క్రికెట్‌ జట్టుకు మహేష్‌..చిత్తూరు ఎమ్మెల్యే అభినందనలు

    చిత్తూరు(రాజనీతి):చిత్తూరు నగరంలోని 46వ వార్డుకు చెందిన యువ క్రికెటర్‌ మహేష్‌ చౌదరి వళ్ళేరును చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ అభినందించారు. శనివారం 46వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.. టీడీపీ నాయకురాలు భవ్య చౌదరి వళ్ళేరు కుమారుడు మహేష్‌ అండర్‌-17 జిల్లా క్రికెట్‌ జట్టుకు ఎంపికైన విషయం తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మహేష్‌ను ఆశీర్వదించి, క్రీడారంగంలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో సాధన కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి చిత్తూరు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తన కుమారుడి ప్రతిభను గుర్తించి అభినందించడంతోపాటు ప్రోత్సహించిన ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌కు భవ్య చౌదరి వళ్ళేరు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

    అత్యధికంగా చదివినవి