Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆరోగ్యకరమైన జీవనశైలితో గుండె పదిలం

    Author RAJANEETHI | 29 Sep 2026, 08:29 PM | ANDHRA PRADESH
    ఆరోగ్యకరమైన జీవనశైలితో గుండె పదిలం

    కలికిరి, సెప్టెంబరు 29 (రాజనీతి): ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఇండియన్ పబ్లిక్ హైస్కూల్లో మేడికుర్తి పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ కావ్యగంధ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోజూ వ్యాయామం, సమతుల్య ఆహారం, తగిన నిద్రతో పాటు బీపీ, షుగర్ నియంత్రణ అవసరమన్నారు. ఛాతీనొప్పి, ఆయాసం, చెమటలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా కుక్కకాటు నివారణ, ఏఆర్‌వీ టీకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ సుజాతమ్మ, పర్యవేక్షకులు సుధాకర్, ఉపాధ్యాయులు, ఆశ కార్యకర్త ధనలక్ష్మి పాల్గొన్నారు.