Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భక్తిశ్రద్ధలతో గణపతి పూజలు..చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ హాజరు...

    భక్తిశ్రద్ధలతో గణపతి పూజలు..చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ హాజరు...

    చిత్తూరు,( రాజనీతి ): చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 10వ వార్డు ఎన్.బీ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ గణపతి విగ్రహానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ సోమవారం తొలి పూజలు నిర్వహించారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపానికి ఎమ్మెల్యే విచ్చేయడంతో కాలనీవాసులు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మండపంలో కొలువుదీరిన గణనాథుడికి ఎమ్మెల్యే హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణపతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేను కలిసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉత్సవ నిర్వాహకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.